Fri Mar 27 2026 11:18:45 GMT+0530 (India Standard Time)
అనంతపురం జిల్లాలో కాల్పులు
అనంతపురం జిల్లాలో కాల్పులు జరిగాయి.

అనంతపురం జిల్లాలో కాల్పులు జరిగాయి. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపాడు. అనంతపురం జిల్లా యాడికిలో గురువారం ఏడేళ్ల బావమరిది వేంచంద్రను హత్య చేసిన బావ సర్వేశ్కుమార్పై పోలీసుల కాల్పులు జరిపారు. ఘటనాస్థలి వద్దకు నిందితుడిని తీసుకెళ్తుండా పోలీసులపై తిరగబడి ఖాళీ బీరు బాటిల్తో దాడిచేశాడు.
ఇద్దరు పోలీసులకు గాయాలు...
సర్వేశ్కుమార్ దాడిలో సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. పోలీసులు హెచ్చరించినా బీరు బాటిల్ పగలగొట్టి దాడిచేయడంతో పోలీసులు గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో సీఐ అతడి మోకాళ్లపై కాల్పులు జరిపారు. అనంతరం నిందితుడిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story

