Sat Mar 07 2026 22:45:05 GMT+0530 (India Standard Time)
హెటిరో డ్రగ్స్ లో పేలుడు
ఔషధ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. విశాఖలోని హెటిరో డ్రగ్స్ లో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఔషధ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. విశాఖపట్నంలోని హెటిరో డ్రగ్స్ లో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదు. డీఎంఎస్వో ప్లాంట్ లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
ఐదుగురికి గాయాలు...
ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక కారణాల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

