Wed Mar 18 2026 09:33:23 GMT+0530 (India Standard Time)
బెజవాడలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా దుకాణాల్లో పేలుడు సంభవించి ఇద్దరు సజీవ దహనమయ్యారు.

విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా దుకాణాల్లో పేలుడు సంభవించి ఇద్దరు సజీవ దహనమయ్యారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు కాశీ, బ్రహ్మంగా గుర్తించారు. వీరిద్దరూ బాణసంచా దుకాణంలో పనిచేసే వారుగా చెబుతున్నారు.
మంటలు చెలరేగి...
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మూడు బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

