Fri Dec 19 2025 01:26:59 GMT+0000 (Coordinated Universal Time)
పుట్టపర్తిలో టెన్షన్... టెన్షన్
పుట్టపర్తిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పుట్టపర్తిలో ఉద్రిక్తత టెన్షన్ నెలకొంది

పుట్టపర్తిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పుట్టపర్తిలో ఉద్రిక్తత టెన్షన్ నెలకొంది. ఆరోపణలపై సత్తెమ్మ ఆలయంలో ప్రమాణానికి రావాలంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిల మధ్య సవాల్ విసురుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను, ఆస్తులను కబ్జా చేసుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. పల్లె మంత్రిగా ఉన్న సమయంలోనే భూకబ్జాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపణలు చేశారు.
వాహనాల ధ్వంసం....
దీంతో టీడీపీ, వైసీపీ నేతలు సత్తెమ్మ ఆలయానికి చేరుకోవడంతో టెన్షన్ నెలకొంది. పుట్టపర్తి నియోజకవర్గంలో 30 యాక్ట్ అమలు చేశారు. పల్లె రఘునాధ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన పల్లె రఘునాధరెడ్డి వాహనంపై రాళ్ల దాడి జరిగింది. టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రయత్నిస్తున్నారు.
- Tags
- puttaparthi
- . tdp
Next Story

