Mon Mar 16 2026 00:00:17 GMT+0530 (India Standard Time)
రేపు నామినేషన్లకు ఆఖరు తేదీ.. అనపర్తి సీటు మాత్రం?
అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి పోటీ చేస్తారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది.

రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఈరోజు అభ్యర్థులు ఎక్కువ సంఖయలో నామినేషన్ లు దాఖలు చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు అనపర్తి సీటు ఎటూ తేలకుండా ఉంది. అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది.
బీజేపీ నుంచి...
అయితే ఇప్పటి వరకూ బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య ఇప్పటికే నామినేషన్ వేశారు. బీజేపీ అధినాయకత్వానికి సీనియర్ నేతలు లేఖ కూడా రాశారు. ఇచ్చిన సీటును టీడీపీ నేతను చేర్చుకుని టిక్కెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో అనపర్తిలో ఏం జరగనుందన్న టెన్షన్ పార్టీ నేతల్లో నెలకొంది.
Next Story

