Thu Jan 29 2026 03:57:08 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ పై దాడికి కాదు.. హత్తుకోవడం కోసమేనట
కడప రిమ్స్ ఆసుప్రతికి వచ్చిన సందర్భంలో జగన్ పై ఒక యువకుడు దూసుకు వచ్చాడని పెద్దయెత్తున ప్రచారం జరిగింది

కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. అయితే నిన్న కడప రిమ్స్ ఆసుప్రతికి వచ్చిన సందర్భంలో జగన్ పై ఒక యువకుడు దూసుకు వచ్చాడని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. వైెఎస్ జగన్ రిమ్స్ ఆసుపత్రిలో టీడీపీ కార్యకర్తలో గాయపడిన అజయ్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పైకి ఒక యువకుడు దూసుకు వచ్చాడు.
అభిమానంతోనే...
అయితే అతను జగన్ పై అభిమానంతోనే అలా వచ్చాడని, . జగన్ను హత్తుకునేందుకు ప్రయత్నించాడని వైసీపీ పార్టీ నేతలు వివరణ ఇచ్చారు. అంతే తప్ప దాడికి ప్రయత్నంచలేదని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారని, జగన్పై దాడికి వైసీపీ కార్యకర్త ప్రయత్నించాడని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Next Story

