Sat Mar 28 2026 18:11:34 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీలో టీడీపీ ఆందోళన.. సభ వాయిదా
ఏపీఅసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. సభ ప్రారంభం కాగానే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. సభ ప్రారంభం కాగానే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను స్పీకర్ ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఐదు నిమిషాలు...
జంగారెడ్డిగూడెంలో వరస మరణాలపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యలోనే టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తంచారు.
Next Story

