Tue Mar 24 2026 03:18:52 GMT+0530 (India Standard Time)
విజయనగరంలో స్ట్రాంగ్ రూం తెరవడంపై టీడీపీ అభ్యంతరం
విజయనగరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, స్వతంత్ర అభ్యర్ధులు ఆందోళనకు దిగారు

విజయనగరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, స్వతంత్ర అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూం నుంచి కలెక్టరేట్ కి అధికారులు తరలించారు. వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వారు ప్రశ్నిస్తున్నాయి.
ఆందోళనకు దిగిన...
పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ తెరచినపుడు తమకెందుకు తెలియపరచలేదని అధికారులను నిలదీశారు.జిల్లా అధికారుల తీరుని ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.వీడియో రికార్డింగ్ చేస్తూ స్ట్రాంగ్ రూమ్ ను తెరచామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ చెబుతున్నారు. అయితే దీనిని మాత్రం టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story

