Sat Mar 07 2026 16:51:44 GMT+0530 (India Standard Time)
పల్నాడులో డిష్యూం.. డిష్యూం
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది

పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించగా, వైసీపీ నేతలు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారు. ఇద్దరూ ఎదురెదురు పడటంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య....
ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థిితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా తరలివచ్చి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాళ్ల దాడి సందర్భంగా పలువురికి గాయాలు కావడంతో, గాయాలయిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు పార్టీల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది. ఇప్పటికీ మాచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మొహరించారు.
Next Story

