Fri Dec 05 2025 15:55:22 GMT+0000 (Coordinated Universal Time)
Kuppam : పోలింగ్ కు 48 గంటల ముందు కుప్పంలో టెన్షన్ టెన్షన్
కుప్పం నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. ఎన్నికలకు ఇంకా రెండు రోజుల ముందు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు

కుప్పం నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. ఎన్నికలకు ఇంకా రెండు రోజుల ముందు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ కౌన్సిలర్ మణికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మణిని వైసీపీ అభ్యర్థి భరత్ పరామర్శించారు. లక్ష్మీపురంలో భారీగా పోలీసుల మోహరించారు.
మహిళపై దాడికి దిగడంతో...
అలాగే కుప్పం మండలం యమనాసనపల్లిలో కూడా ఉద్రిక్తత చోట చేసుకుంది. స్థానికులపై వైసీపీ సర్పంచ్ సురేష్ దౌర్జన్యానికి దిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు. డబ్బులు పంచుతుండగా సర్పంచ్ ను మహిళ అడ్డుకున్న సందర్భంలో దాడి జరిగింది. ప్రశ్నించిన మహిళపై సర్పంచ్ సురేష్ దాడి చేశారు. వైసీపీ సర్పంచ్ సురేష్ ను గ్రామస్థులు నిర్బంధించారు. మహిళ పైనే దాడి చేస్తారా అంటూ గ్రామస్థులు నిలదీశారు. పోలీసులు నచ్చజెప్పాలని చూసినా గ్రామస్థులు శాంతించలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
Next Story

