Mon Dec 15 2025 08:27:10 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ వద్ద ఉద్రిక్తత
విశాఖ రుషికొండ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ నేతలు రుషికొండ పర్యటనకు మాత్రం పోలీసులు అనుమతించలేదు

విశాఖ రుషికొండ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ నేతలు రుషికొండ పర్యటనకు మాత్రం పోలీసులు అనుమతించలేదు. ఒక్క సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను మాత్రమే పోలీసులు అనుమతించారు. హైకోర్టు అనుమతితో నారాయణను రుషికొండకు పోలీసులు అనుమతించారు.
నారాయణకే అనుమతి....
రుషికొండను తవ్వి పర్యావరణానికి వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎవరినీ అనుమతించకపోవడానికి కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. పారదర్శకంగా చేయాల్సిన పనులను ఎందుకు రహస్యంగా చేస్తున్నారని ఆయన నిలదీశారు. రక్షణ శాఖకు సంబంధించింది అయితే ఎవరూ అభ్యంతరం చెప్పరని, కానీ రుషికొండను తవ్వి ఏం చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని రామకృష్ణ అన్నారు.
- Tags
- rushikonda
- cpi
Next Story

