Thu Jan 29 2026 08:52:48 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మంత్రుల శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెన్స్.. నేడు కేటాయిస్తే?
మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇంకా సస్పెన్స్ సాగుతోంది. శాఖలు కేటాయిస్తేనే బాధ్యతలను చేపట్టాల్సి ఉంది.

మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇంకా సస్పెన్స్ సాగుతోంది. నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మంత్రుల శాఖలను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఐఏఎస్ అధికారులతో సమావేశం కారణంగా అది జరగలేదు. దీంతో మంత్రులు ఇంకా పదవీ బాధ్యతలను స్వీకరించలేదు.
బాధ్యతల స్వీకరణ...
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించనున్నారు. అప్పుడు ఎవరికి కేటాయించిన శాఖలో వారు బాధ్యతలను తీసుకునే వీలుంటుంది. దీంతో ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ లో ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మంత్రుల శాఖలపై క్లారిటీ రానుండటంతో ఇక మంత్రులు ముహూర్తం చూసుకుని బాధ్యతలను స్వీకరించే అవకాశముంది.
Next Story

