Wed Feb 04 2026 15:25:26 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య తిరుమలలో తక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య తిరుమలలో తక్కువగానే ఉంది. అయితే సంక్రాంతి సెలవులు వస్తుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు సంక్రాంతి సెలవులకు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 61,511 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 20,777 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
Next Story
