Thu Mar 20 2025 02:04:39 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది. ఎక్కువ మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగా ఉండటానికి కారణం మహా కుంభమేళా అని చెబుతున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు వెళ్లి భక్తులు పుణ్యస్నానాలు చేసి రావాలని తరలి వెళ్లడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని చెబుతున్నారు.
రేపు ఎక్కువగా...
తిరుమలలో భక్తులు రద్దీ సోమవారం తక్కువగానే ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక కూడా తగ్గడానికి కారణం మహా కుంభమేళా అని చెబుతున్నారు. దీంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులు లేకబోసిపోయి కనిపిస్తున్నాయి. మాడవీధుల్లో కూడా భక్తుల సంచారం లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రేపు భక్తుల రద్దీ ఎక్కువగా వచ్చే అవకాశముంది. రథసప్తమి కావడంతో రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు రేపు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని ఆరు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story