Tue Mar 17 2026 15:45:01 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గని రష్.. ఎందుకంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. బుధవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. బుధవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామి దర్శనం కోసం భక్తులకు 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సర్వదర్శనం కోసం క్యూలైన్ లోకి వచ్చే వారికి అదనంగా మరో ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం....
మూడు వందల రూపాయల ప్రత్యేక టిక్కెట్ తీసుకున్న వారికి స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,461 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,631 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.77 కోట్ల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story

