Sun Apr 02 2023 00:04:23 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వారికి దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని తిరులమ తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
16 గంటల సమయం....
నిన్న శ్రీవారిని 62,725 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,712 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.85 కోట్ల రూపాయలు అని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. క్యూలైన్ లో ప్రస్తుతం నిలుచున్న వారికే 16 గంటల సమయం పడుతుందని, కొత్తగా వచ్చే వారికి మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story