Tue Mar 17 2026 19:19:28 GMT+0530 (India Standard Time)
క్యూ లైన్ తిరుమలలో తగ్గడం లేదుగా?
ఏటీ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ ఉంది. దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఏటీ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ ఉంది. భక్తులకు స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ. 300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
24 గంటల సమయం...
నిన్న తిరుమల శ్రీవారిని 77,956 మంది భక్తులు దర్శించకున్నారు. వీరిలో 33,672 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

