Fri Mar 21 2025 06:45:50 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎంత ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శుక్రవారం ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారని భావించి ముందుగానే అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా మజ్జిగ అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
వసతి గృహాల కొరత...
తిరుమలకు భక్తులు పోటెత్తుతుండటంతో వసతి గృహాల కొరత కూడా భక్తులను ఇబ్బంది పెడుతుంది. వసతి గృహాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు చెబుతున్నారు. ముందుగా వసతి గృహాలను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు తెలిపారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు శుక్ర, శనివారాలు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుందామని తిరుమలకు వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నామని అధికారులు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోల చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,203 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,793 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story