Fri Dec 05 2025 22:49:09 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ...దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం భక్తులు ఎక్కువగా వస్తారు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం భక్తులు ఎక్కువగా వస్తారు. తిరుమలలో శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీళ్లను క్యూ లైన్లలోకి, కంపార్ట్ మెంట్లలోకి భక్తులకు అందిస్తున్నారు.
తాకిడి పెరగడంతో...
తిరుమలలో భక్తుల తాకిడి నిత్యం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక దర్శనాలతో పాటు సర్వదర్శనాలు, ఎస్.ఎస్.డి టోకెన్లు జారీ చేయడం, కాలినడకన వచ్చే భక్తులతో తిరుమలకు ఒక్కసారిగా రద్దీ పెరిగింది. అయితే ఎంత మంది భక్తులు వచ్చినప్పటికీ దర్శనం మాత్రం అందరికీ సులువుగా అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వేసవి రద్దీ ఎక్కువ కావడంతో తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీని కూడా ఎక్కువగా చేస్తున్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు అపరమితంగా తయారు చేస్తున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒకటి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా క్యూలో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,227 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,951 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారుల వెల్లడించారు.
Next Story

