Sat Dec 06 2025 00:06:34 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారమయినా భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారమయినా భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. తిరుమలకు భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గత నాలుగు నెలల నుంచి భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉంది. మే 15వ తేదీ నుంచి ప్రారంభమయిన భక్తుల రద్దీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఇక రానున్నది దసరా సెలవులతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాడ వీధుల్లో స్వామి వారి వివిధ అలంకారాల్లో ప్రత్యక్షమవుతారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.
దసరాకు మరింతగా...
దసరా ఉత్సవ ఏర్పాట్లను సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్న టీటీడీ ఈవో శ్యామలరావు స్థానంలో గతంలో ఈవోగా పనిచేసి సమర్థంగా పనిచేసి ప్రశంసలు అందుకున్న అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించారు. ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నారని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పందొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,828 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో : 26,296 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.07 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

