Fri Dec 05 2025 13:19:00 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నానిపై వేలాడుతున్న కేసుల కత్తి..ఎప్పుడైనా అరెస్టంటూ?
మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ ఎంతో దూరం లేదని ప్రచారం జరుగుతుంది.

మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ ఎంతో దూరం లేదని ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడంతో ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇటీవల కొడాలి నానికి గుండెకు సంబంధించిన ర్జరీ జరిగింది. ఇప్పటికీ ఆయన పూర్తిగా కోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బయటకు వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్ కు సంతకాలు పెట్టేందుకు వచ్చినప్పుడు కూడా ఆయన బెల్టు తో వస్తున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు గుడివాడ నియోజకవర్గంలోతొలి సారి ఓటమి పాలయి కొడాలి నాని నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు.
తిరుగులేదని భావించి...
గుడివాడలో గెలుపునకు తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురయింది. పార్టీలు మారినా గుడివాడ ప్రజలు కొడాలి నానిని అదరించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి ఆ ఓటమిని కొడాలి నాని ఊహించలేదు. గుడివాడ ప్రజలు తనను వదులుకోరని కొడాలి నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కానీ అది అతి విశ్వాసం అన్నది తేలిపోయింది. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ, అటు మీడియా సమావేశాల్లోనూ, టీవీ ఇంటర్వ్యూల్లో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు మర్చిపోలేకపోతున్నారు. ఆయనను అరెస్ట్ చేయాల్సిందేనంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది.
టీడీపీ నుంచి తొలిసారి గెలిచి...
2004 కొడాలి నాని టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఎన్నికయ్యారు. 2009లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వెళ్లారు.ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. గుడివాడలో తనకు తిరుగులేదని భావించిన కొడాలి నాని ప్రత్యర్థులను ఒక ఆటాడుకున్నారు.దీంతో అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని అనుచరులు వరసగా అరెస్ట్ అవుతున్నారు. అన్ని కేసులు బయటకు తీసి పోలీసులు వరస బెట్టి అరెస్ట్ లు చేస్తున్నారు. తర్వాత వంతు కొడాలి నానిదేనని అంటున్నారు.
మరో కేసు నమోదు కావడంతో...
తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై మరో పోలీసు కేసు నమోదయింది. విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంజనా ప్రియ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపర్చే విధంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి కొడాలి నాని పై పోలీసులు కేసు నమోదు చేసి గుడివాడలోని ఆయన ఇంటికి వెళ్లి 41 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీచేశారు. విచారణకు రావాలని కోరారు. అయితే కొడాలి నాని గుడివాడలో లేకపోవడంతో ఇంటివద్ద ఉన్న నాని మనుషులకు ఆ నోటీసులు అందచేసినట్లు తెలిసింది. ఈ కేసులో కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని కృష్ణా జిల్లాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story

