Wed Mar 18 2026 18:19:20 GMT+0530 (India Standard Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఏపీలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి.

విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఏపీలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,19,560 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,730 మంది మరణించారు.
ఒక్క కేసు కూడా..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 23,04,628 గా ఉంది. 202 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,34,41,365 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగం చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story

