Sat Mar 07 2026 23:41:04 GMT+0530 (India Standard Time)
Narendra Modi : ఏపీలో మోదీ పర్యటన వాయిదా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ పర్యటన వాయిదా పడినట్లు భారతీయ జనతా పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది.
7,8 తేదీల్లో...
ఈ నెల 3, 4 తేదీలకు బదులుగా 7,8 తేదీల్లో మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. 7,8 తేదీల్లో ఆయన పీలేరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు. 8వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

