Fri Dec 05 2025 08:57:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఏపీలో టెట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా డీఎస్సీ త్వరలో నిర్వహించనున్న సందర్భంలో టెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి పదహారో తేదీ వరకూ దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే నాలుగో తేది నుంచి పదిహేడో తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు నెలలో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆన్ లైన్ విధానంలో....
ఆన్ లైన్ విధానంలో ఈ టెట్ పరీక్ష జరుగుతుందని విద్యాశాఖ కమిషనర్ సురేష్ మీడియాకు తెలిపారు. మెగా డీఎస్సీకి, టెట్ కు మధ్య నెల రోజుల వ్యవధి ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏపీలో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకాన్ని చంద్రబాబు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు పదహారు వేల పోస్టుల భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Next Story

