Thu Jan 29 2026 01:09:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ లోనే చంద్రబాబు... కుప్పం నేతలకు?
కుప్పం ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలను అర్ధరాత్రి అరెస్ట్ లు చేయడంతో ఆందోళనకు దిగాయి.

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలను అర్ధరాత్రి అరెస్ట్ లు చేయడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలింగ్ ప్రారంభమయింది. పెద్దయెత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కుప్పంలో స్థానికేతరులు ఉన్నారని, వారు వైసీపీ నేతలు కావడంతో పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అవసరమైతే....?
మరోవైపు కుప్పం పోలింగ్ పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈరోజు ఇప్పటికే రెండు సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొనాలని, తానున్నానంటూ నేతలకు భరోసా చంద్రబాబు ఇచ్చారు. అవసరమైతే తాను కుప్పం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Next Story

