Thu Jan 29 2026 07:42:45 GMT+0000 (Coordinated Universal Time)
నరసరావుపేటలో టెన్షన్
నరసరావుపేటలో టెన్షన్ నెలకొంది హత్యకు గురైన జల్లయ్య మృతదేహానికి నరసరావుపేట ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు

నరసరావుపేటలో టెన్షన్ నెలకొంది. పల్నాడు జిల్లాలో నిన్న హత్యకు గురైన జల్లయ్య మృతదేహానికి నరసరావుపేట ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. అయితే జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు చేరుకుంటుండటంతో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ముందస్తు అరెస్టులు....
నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జి అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్రిక్తత తలెత్తే అవకాశముందని 144 సెక్షన్ విధించారు. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త హత్యకు గురికావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సయితం డీజీపీ లేఖ రాశారు.
Next Story

