Tue Mar 03 2026 17:15:35 GMT+0530 (India Standard Time)
నగరిలో టెన్షన్.. రెండు వర్గాలు పోటాపోటీగా?
నగరి నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రెండు వర్గాలు కార్యక్రమాలు చేపట్టాయి

నగరి నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రెండు వర్గాలు కార్యక్రమాలు చేపట్టాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె వ్యతిరేక వర్గం జగన్ పుట్టిన రోజు వేడుకలకు వేర్వేరుగా కార్యక్రమాలను రూపొందించుకున్నాయి. నిన్న ఫ్లెక్సీలు చింపి వేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
భారీ బందోబస్తు...
దీంతో పోలీసులు నగరి నియోజకవర్గంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. రోజా వ్యతిరేకవర్గం ర్యాలీ తీస్తామని ప్రకటించడంతో పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

