Fri May 17 2024 10:35:27 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరిలో ఉద్రిక్తత
మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలకృష్ణ సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ ను తొలగించారు.
మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నందమూరి బాలకృష్ణ సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ ను తొలగించారు. మున్సిపల్ సిబ్బంది అన్నా క్యాంటిన్ ను తొలగించడంతో తెలుగుదుశం పార్టీ శ్రేణులు పెద్దయెత్తున అక్కడకు చేరుకుని నినాదాలు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటిన్ ను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ నేతలు గట్టిగా కోరుతున్నారు. ముఖ్యమైన నేతలు మంగళగిరికి రాకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
లక్ష మందితో....
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మంగళగిరి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అక్కడే అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేస్తామని టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తుననాయి. దీంతో మంగళగిరిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నా క్యాంటిన్ ఏర్పాటును అంగీకరించేది లేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. దీనికి టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారు. త్వరలోనే లక్షమందితో చలో మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Next Story