Sat Mar 14 2026 12:35:56 GMT+0530 (India Standard Time)
మచిలీపట్నంలో టెన్షన్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టెన్షన్ నెలకొంది

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నాని, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పేర్ని నాని ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. రామానాయుడు పేటలో జనసేన జెండా దిమ్మ ఏర్పాటుకు సంబంధించిన వివాదం తలెత్తింది.
పేర్ని నాని వర్సెస్ పోలీసులు...
జనసేన నేతలు జనసేన జెండా దిమ్మెను ఏర్పాటు చేయడానికి యత్నించగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేత బుర్ర విఠల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పేర్ని నాని పోలీస్ స్టేషన్ వద్ద కు వెళ్లి ఆందోళనకు దిగడంతో విఠల్ ను వదిలేశారు. అయితే పేర్ని నాని ఇంటివద్దకు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడం, జనసేన కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుంటుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పేర్ని నానికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Next Story

