Sun Mar 15 2026 11:13:42 GMT+0530 (India Standard Time)
జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్
తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు కదలకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకపోవడంతో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
కోన ఆలయ తిరునాళ్లకు...
దీంతో తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా జేసీ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. కోన ఆలయ తిరునాళ్లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకేసారి తిరునాళ్లకు వెళ్తున్నారని తెలిసి పోలీసులు అప్రమత్తమై ఆయనను హౌస్ అరెస్ట్ చేశారని తెలిసింది
Next Story

