Wed Jan 21 2026 08:40:34 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు పంతం.. బాంబులు వేసుకున్న ఇరువర్గాలు
పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మాచర్ల, గురజాల వంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి

పల్నాడు జిల్లాలో ఉదయం నుంచి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మాచర్ల, గురజాల వంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అయితే తాజాగా గురజాల నియోజకవర్గంలోని తంగెడ గ్రామంలో ఇరువర్గాలు బాంబులతో దాడులకు దిగాయి. దీంతో కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పది మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఓటు విషయంలో...
ఒక ఓటు విషయంలో తలెత్తిన వివాదంలో తంగెడ గ్రామంలో రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. సత్తెనపల్లిలోనూ కొన్ని గ్రామాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మిషన్లు పగులకొట్టడంతో ఈ కేంద్రంలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. నరసరావుపేటలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఘర్షణలు జరుగుతున్నాయి.
Next Story

