Sun Mar 15 2026 14:05:47 GMT+0530 (India Standard Time)
Allagadda : ఆళ్లగడ్డలో టెన్షన్.. భూమా అఖిల అరెస్ట్‌కు
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నించారు

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నించారు. . భవిస్యత్ గ్యారంటీ కార్యక్రమం కోసం భూమా అఖిలప్రియ అక్కడకు వెళుతున్నారు. అప్పటికే అదే గ్రామంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అప్పటికే గడపడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు.
నోటీసులు ఇవ్వలేదంటూ...
దీంతో అక్కడ ఎమ్మెల్యే ఉండటంతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. అక్కడకు వెళ్లవద్దంటూ పోలీసులు తెలిపారు. అయితే తాను వెళ్లి తీరాల్సిందేనంటూ భూమా అఖిలప్రియ పట్టుబట్టడంతో ముందస్తుగా ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే తనకు ముందుగా ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదంటూ అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Next Story

