Wed Dec 17 2025 08:48:34 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నాని ఇంటివద్ద టెన్షన్
కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రికత్త తలెత్తింది. గుడివాడలోని ఆయన ఇంటివద్దకు జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రికత్త తలెత్తింది. గుడివాడలోని ఆయన ఇంటివద్దకు జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గుడివాడలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలు కొడాలి నాని ఇంటిని ముట్టడించారని తెలియడంతో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
రోడ్లకు మరమ్మత్తులు చేయాలని....
గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలని కోరుతూ ఇంటి ముట్టడికి దిగిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొడాలి నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. సీఎం మేలుకోవాలంటూ ప్లకార్టులతో ప్రదర్వన చేశారు. గుడివాడ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story

