Mon Feb 02 2026 07:28:10 GMT+0000 (Coordinated Universal Time)
బాలకృష్ణ ఇంటి వద్ద టెన్షన్... వైసీపీ క్యాడర్ ముట్టడి
హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హిందూపురం అభివృద్ధిపై చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది

హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హిందూపురం అభివృద్ధిపై చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. 21 వార్డులో డంపింగ్ యార్డుపై టీడీపీ నేత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైసీపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది.
పోటా పోటీగా......
హిందూపురం నగర అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ఇంటిపైకి దాడికి దిగడమేంటని టీడీపీ నేతల ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురంలో లేకపోయినా ఆయన ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా పెద్ద యెత్తున మొహరించి వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్దయెత్తున మొహరించి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు.
Next Story

