Sun Mar 15 2026 09:52:51 GMT+0530 (India Standard Time)
Jammalamadugu : జమ్మలమడుగులో హైటెన్షన్.. అందరూ హౌస్ అరెస్ట్
జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, కూటమి నేతలను గృహనిర్భంధంలో ఉంచారు

జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య విసురుకున్న సవాళ్లు మరింత అగ్గిన రాజేశాయి. దీంతో ఇద్దరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కూడా పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. ఎవరినీ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు వారిపై ఆంక్షలు విధించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ ఆఫీసుల వద్ద కూడా పోలీసులు భారీగా మొహరించారు.
ఎస్పీ అక్కడే మకాం వేసి...
ఎన్నికల సమయంలో జరిగిన హింసతో పాటు సుధీర్ రెడ్డి పై జరిగిన దాడితో ప్రతి దాడులు జరుగుతాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అక్కడే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు బయటకు వచ్చినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story

