Sat Dec 06 2025 09:01:48 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం క్లాక్‌టవర్ వద్ద టెన్షన్
అనంతపురం క్లాక్‌టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలో కానిస్టేబుల్ గాయపడ్డారు

అనంతపురం క్లాక్‌టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలో కానిస్టేబుల్ గాయపడ్డారు. రాప్తాడు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారన్న దానిపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.
వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య...
అయితే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ మద్దతుదారులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురం క్లాక్‌టవర్ సెంటర్ కు రావాలంటూ సవాల్ విసురుకున్నారు. దీంతో పోలీసులను తప్పించుకున్న నేతలు ఒకరిపై ఒకరు ఘర్షణ పడటంతో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story

