Sun Mar 08 2026 04:08:20 GMT+0530 (India Standard Time)
పాత పదిమంది మంత్రులకు కొత్త కేబినెట్ లో?
పాత కేబినెట్ లో ఉన్న పది మంది మంత్రులను కొత్త కేబినెట్ లోననూ కొనసాగించే వీలుంది

పాత కేబినెట్ లో ఉన్న పది మంది మంత్రులను కొత్త కేబినెట్ లోననూ కొనసాగించే వీలుంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదిమందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించారని తెలిసింది. సీనియారిటీ తో పాటు శాఖల అవసరాన్ని కూడా జగన్ పరిగనణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నానికి రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితా చేరే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కొనసాగనున్న మంత్రులు వీరే...
పాత కేబినెట్ లో ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, అంజాద్ భాషా ఉన్నారని తెలిసింది. వీరికి వివిధ ప్రాధాన్యాల దృష్ట్యా కొత్త మంత్రివర్గంలోనూ జగన్ కొనసాగించనున్నారు.
Next Story

