Sun Mar 15 2026 15:02:40 GMT+0530 (India Standard Time)
Tamilnadu : తమిళనాడులో అయ్యప్ప భక్తులపై దాడి... పరిస్థితి ఉద్రిక్తం
తమిళనాడులోని తిరుచారపల్లిలోని శ్రీరంగంలోని రంగనాధ స్వామి ఆలయంలో ఆలయ సిబ్బంది భక్తులపై దాడి చేశారు.

తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తులపై దాడి జరిగింది. తమిళనాడులోని తిరుచారపల్లిలోని శ్రీరంగంలోని రంగనాధ స్వామి ఆలయంలో ఆలయ సిబ్బంది భక్తులపై దాడి చేశారు. అయ్యప్ప ఆలయానికి వెళ్లేవారంతా తమిళనాడు, కేరళలోని ఆలయాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు శ్రీరంగం వెళ్లారు. అందులో శ్రీరంగం ప్రముఖమైన పుణ్యక్షేత్రం కావడంతో ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వెళతారు.
గాయపడిన వారిని...
రంగనాధ స్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే అందరూ అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అయితే ఆలయానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తులపై ఆలయ సిబ్బంది దాడి చేయడంతో కొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన అయ్యప్ప భక్తులు తమ వారిపై దాడికి దిగిన వారిని శిక్షించాలని కోరుతూ ఆలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.
Next Story

