Mon Dec 15 2025 08:12:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూలా నక్షత్రం.. మూడు గంటలకే సర్వదర్శనానికి అనుమతి
నేడు ఇంద్రకీలాద్రిపై తెల్లవారుజామున మూడు గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు

నేడు ఇంద్రకీలాద్రిపై తెల్లవారుజామున మూడు గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు మూలా నక్షత్రం కావడంతో దుర్గాదేవి పుట్టిన రోజు కావడంతో ఈ అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఈ రోజు లక్షల సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను దుర్గాదేవికి సమర్పిస్తారు.
పట్టువస్త్రాలను సమర్పించనున్న...
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, శాసనసభ్యులు బంగారువాకిలి నుంచి దర్శనం చేసుకుంటారు. ఈరోజు అందరికీ ఉచిత దర్శనం కల్పించారు. ఈరోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్ లో తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదనపు పోలీసులను నియమించారు. వీఐపీ, వీవీఐపీ, అంతరాలయ దర్శానాలను ఈరోజు నిలిపేశఆరు.
Next Story

