Wed Jan 21 2026 09:57:01 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలంలో మహా కుంభోత్సవం
శ్రీశైల మహా క్షేత్రంలో జరగబోయే కుంభోత్సవం కార్యక్రమానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు

శ్రీశైల మహా క్షేత్రంలో జరగబోయే కుంభోత్సవం కార్యక్రమానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరుగనుంది. ప్రాతః కాల ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు సమర్పిస్తారు.సాయంకాలం మల్లికార్జున స్వామి వారికి ప్రదోషకాల పూజలు అనంతరం అన్నాభిషేకం జరుగుతుంది. అనంతరం స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు...
సాయంత్రం స్వామివారి పూజల అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షణ మండపంలో అన్నాన్ని కుంభరాశిగా వేస్తారు. అదేవిధంగా సింహం మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పించనున్నారు, తర్వాత సాంప్రదాయాన్ని అనుసరించే స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభం అవుతుంది. ఈ కుంభ హారతి సమయంలోనే అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించబడతాయి.ఈ పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.
Next Story

