Fri Feb 20 2026 13:46:18 GMT+0530 (India Standard Time)
Weather Report : అప్పుడే ఇన్ని డిగ్రీలు నమోదయితే మున్ముందు ఎంతో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట కొంత చలి అని అనిపిస్తున్నప్పటికీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భానుడు సెగలు కక్కుతున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని కూడా తెలిపింది. అయితే వానలు అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కొన్నిచోట్ల వానలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వానలతో పాటు... ఎండలు...
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పింది. ఉదయం వేళ పొగమంచు కూడా కొన్ని ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎండల తీవ్రత కోస్తాంధ్ర, పల్నాడు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో మాత్రం రెండు నుంచి నాలుగు డిగ్రీలు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి వేళల్లో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నపిల్లలు ఇంటికే పరిమితమవ్వడం మంచిదని అన్నారు.
మూడో వారానికే...
తెలంగాణ రాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటేశాయని, గురువారం నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబా ద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉం టుందని, ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరిలో నే ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. పలుచోట్ల 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు దాటాయని అధికారులు తెలిపారు.
Next Story

