Wed Dec 17 2025 06:44:27 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆ మాటలెందుకు అచ్చెన్న
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయి.. చాలా రోజులు అవుతూ ఉంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయి.. చాలా రోజులు అవుతూ ఉంది. అయితే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంత వరకు స్పందించలేదు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కూడా మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ... జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని చెప్పారు. పోయి ఆయననే అడిగితే సమాధానం చెపుతాడని, తనను అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు. స్పందించాలని తాము ఎవరినీ అడగమని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు.
ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కు తారక్ వెళ్లారని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించిన ఎయిర్‌పోర్టు ఫొటోలను చూసిన అభిమానులు.. తారక్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారని చెబుతున్నారు. తారక్ వెళ్లింది వెకేషన్‌కు కాదని.. దుబాయ్‌లో జరిగే ప్రతిష్టాత్మక SIIMA Awards 2023 ఈవెంట్లో పాల్గొననున్నారని అంటున్నారు. ఆర్ఆర్ఆర్లో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును అందుకోనున్నాడని తెలుస్తోంది. అలాగే తారక్‌తో నటి హిమజ దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్ సైమా అవార్డ్స్ కోసం చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు.
Next Story

