Sat Mar 07 2026 17:41:00 GMT+0530 (India Standard Time)
Pithapuram : పిఠాపురంలో టీడీపీ క్యాడర్ ఆగ్రహం.. జెండాలు దగ్ధం చేసి
పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు దగ్దం చేశారు

పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ మాజీఎమ్మెల్యే వర్మ అనుచరులు తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ జెండాలు తగులపెట్టారు. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటూ వారు నినాదాలు చేశారు. స్థానికేతరులు ఇక్కడ పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ వారు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు.
జనసేన క్యాడర్ తో...
అయితే తమ అధినేత ఇక్కడ బరిలోకి దిగుతుంటే పొత్తులో ఉన్న పార్టీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడం ఏమిటని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని వారు అంటున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పి పంపారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలంటూ ఆయన అనుచరులు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. వర్మ మాత్రం ఇంత వరకూ దీనిపై స్పందించలేదు.
Next Story

