Wed Dec 10 2025 18:12:48 GMT+0000 (Coordinated Universal Time)
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీదే గెలుపు
ఈరోజు జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు.

ఈరోజు జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. కడప జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం మల్లంపల్లి పంచాయతీ సర్పంచ్ టీడీపీ అభ్యర్థి బెల్లంకొండ అమరేశ్వరరావు 143 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కడప జిల్లా రయచోటి మండలం పెమ్మడపల్లి గ్రామపంచాయతీ ఏడో వార్డులో టీడీపీ మద్దతుదారు ఇడగొట్టు లీలావతమ్మ నలభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కర్నూలు జిల్లాలో...
నంద్యాల మండలం భీమవరంలో జరిగిన నాలుగో వార్డులో 12 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ మద్దతుదారు జనార్థన్ రెడ్డి గెలుపొందారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడులో ఐదోవార్డును టీడీపీ అభ్యర్థి గోరంట్ల లక్ష్మీ తులసి 101 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కంభం మండలం కందులాపురంలో ఆరోవార్డులో టీడీపీ అభ్యర్థి బండారు లక్ష్మ ి 63 ఓట్లతో విజయం సాధించారు. తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామంలోని రెండో వార్డును కూడా టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడాతో గెలిచారు.
ప్రకాశం జిల్లాలో....
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నిడమానూరులోని 12వ వార్డులో టీడీపీ మద్దతుదారు కాకుమాను సుబ్బారావు 46 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామ పంచాయతీలోనూ టీడీపీ మద్దతు దారు ముప్పాళ్ల శ్రీనివాసరావు విజయం సాధించారు. చాలా చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందుతుండటం విశేషం.
Next Story

