Sun Feb 01 2026 08:13:09 GMT+0000 (Coordinated Universal Time)
మూడోరోజు లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి మూడో రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఈరోజు శాంతిపురం రాత్రి బస నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర దాదాపు పది కిలోమీటర్లు కొనసాగనుంది. ఈరోజు ఉదయం 8.45 గంటలకు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఉదయం 9.45 గంటలకు సండే మార్కెట్ వద్ద పబ్లిక్ తో వాకింగ్ ఇంట్రాక్షన్ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈరోజు సమావేశాలు...
మధ్యాహ్నం 12.45 గంటలకు కుతెంగెట్టపల్లి జంక్షన్ వద్ద భోజన విరామం కోసం ఆగుతారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు చెల్దిగాని పల్లె వద్ద రాత్రి బస చేయనున్నారు. అక్కడ సెరీకల్చర్, హార్టికల్చర్ రైతులతో సమావేశం ఉంటుంది. చెల్దిగానిపల్లెలోనే లోకేష్ రాత్రి బస చేయనున్నారు. లోకేష్ పాదయాత్రకు పెద్దయెత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు.
Next Story

