Sun Mar 08 2026 02:56:19 GMT+0530 (India Standard Time)
మమతకు తప్పుడు సమాచారం
పెగాసస్ సాఫ్ట్ వేర్ ను తాము కొనుగోలు చేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను తాము కొనుగోలు చేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తమ వద్దకు ఒక సంస్థ పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయాలని సంప్రదింపులు జరిపిందని, అయితే తాము దానిని కొనుగోలు చేయలేదని చెప్పారు. తాము దానిని కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవారు కాదన్నారు.
కొనుగోలు చేయలేదు....
కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని ఆరోపించారు. తమ వద్దకు 25 కోట్లకు విక్రయిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వచ్చారని, అయితే తాము దానిని తిరస్కరించామని, అప్పటి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమత ఆరోపించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ మమతకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు.
Next Story

