Thu Mar 19 2026 01:42:43 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : మూడు రాజధానుల అంశం ముగిసినట్లే
అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు

అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతే ఏపీకి రాజధాని అని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఆలోచనల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.
రాజధాని అమరావతి...
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య అమరావతి ని కొంతమేరకు నిర్మించామన్న నారా లోకేష్, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు. కానీ అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేక పోయామని,ప్రస్తుతం అమరావతిని పునర్నిర్మించే పనిలో ఉన్నామని, మూడు రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లేనని నారా లోకేష్ పేర్కొన్నారు.
Next Story

