Sat Apr 04 2026 12:08:51 GMT+0530 (India Standard Time)
జగన్ పై నారా లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తన తల్లిని అసెంబ్లీలో అవమానించారన్న విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారని గమనించి జగన్ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేశారని లోకేష్ అన్నారు. మూడు రాజధానులు అంటూ రెండున్నరేళ్లు ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. ప్రజలను ఆ అంశం నుంచి డైవర్ట్ చేయడానికే జగన్ ఈ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు.
రెండున్నరేళ్లలో....
నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ పైనా అవగాహన లేదన్నారు. ఆయన రెండున్నరేళ్ల హయాంలో రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళుతున్నారో తెలియదని లోకేష్ ఎద్దేవా చేశారు. అమ్మవొడి, పించణ్ల సంఖ్యను పెంచాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని నారా లోకేష్ అన్నారు.
Next Story

