Thu Dec 18 2025 20:56:45 GMT+0000 (Coordinated Universal Time)
బూతులు తిడితే సెక్యూరిటీ పెంచుతారా?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టిన వారికి సెక్యూరిటీ పెంచుతారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని వెలగపూడి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ముఖ్మమంత్రి పదవి ఎంత రాజ్యాంగబద్ధమైనదో అలాగే ప్రతిపక్ష నేత పదవి కూడా అంతేనని ఆయన చెప్పారు.
అక్రమ కేసులు పెడుతూ....
టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. మైండ్ గేమ్ ఆడుతూ మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో తూలనాడారని వెలగపూడి రామకృష్ణ అన్నారు.
Next Story

