Sun Dec 14 2025 01:54:58 GMT+0000 (Coordinated Universal Time)
బాబును అంతమొందించే కుట్ర
చంద్రబాబు టీం పడవ ప్రమాదం వెనక ప్రభుత్వ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు

చంద్రబాబు టీం పడవ ప్రమాదం వెనక ప్రభుత్వ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సోంపల్లి వద్ద బోటు తిరగబడింది. పంటు గొలుసులు కొందరు కావాలనే తెంపేశారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. చంద్రబాబును అంతమొందించేందుకు కుట్ర జరిగిందని ఆయన అన్నారు. అక్కడ సరైన ఏర్పాట్లను స్థానిక అధికారులు చేయలేదని జవహర్ ఆరోపించారు.
భద్రత కల్పించలేదని...
సరైన భద్రత కల్పించలేదని, చంద్రబాబు వద్ద ఉన్న జడ్ ప్లస్ కేటగిరీ సిబ్బందికి కూడా స్థానిక అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలను అంతమొందించే కుట్ర జరిగినట్లు తమకు అనుమానంగా ఉందన్నారు. నిన్న జరిగిన పడవ ప్రమాదం పై విచారణ జరపాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా సోంపల్లిలో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇందులో ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గోదావరి లో పడిపోయారు. మరోవైపు చంద్రబాబు మాత్రం నిన్న జరిగిన ప్రమాదకరం దురదృష్టకరమని అన్నారు.
Next Story

